టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం). రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ తారలు అజయ్‌దేవ్‌గన్, అలియా భట్ నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోగా..ఈ మధ్యనే షూటింగ్ పున : ప్రారంభం అయ్యింది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీ ఫై అనేక రూమర్లు బయటకు వస్తూ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు వార్తలు వైరల్ కాగా..తాజాగా మరో వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధుడిలా కనిపించబోతున్నారని టాక్. దీని కోసం ప్రొతెస్టిక్ మేకప్ వేస్తున్నారట. ఎన్టీఆర్‌ను ముసలి వ్యక్తిలా చూపించడానికి భారీగా ప్రొతెస్టిక్ మేకప్ అవసరం పడుతోందని అంటున్నారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని.. సినిమాకు ఇదో ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ ఎన్టీఆర్ తొలిసారి ప్రొతెస్టిక్ మేకప్ వేసుకుంటున్నారు అనే అంశం ఆసక్తి రేపుతోంది.