సినీ ఇండస్ర్టీలన్నింటిలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల జోరు నడుస్తోంది. అన్ని భాషల సూపర్ స్టార్లను పెట్టి పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేయడం మూలాన మార్కెట్ ను పెంచుకోవచ్చనే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. అందుకోసమే పారితోషకం విషయంలో వెనుకడుగు వేయకుండా తాము ఎవరినైతే తీసుకోవాలని భావించారో వారినే తీసుకునేలా దర్శకులు నిర్మాతలను ఒప్పిస్తున్నారు. మార్కెట్ బాగా కలిసి వస్తుందని డైరెక్టర్లు చెప్పడంతో నిర్మాతలు కూడా వారికి అడ్డు చెప్పలేకపోతున్నారు. ఈ విధంగానే సినిమాల బడ్జెట్ తడిసి మోపెడవుతుందని వాదించే వారు కూడా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా చిత్రాల్లో అన్ని భాషలకు చెందిన స్టార్లను తీసుకోవడం వల్ల ప్రమోషన్ విషయంలో కలిసి రావడమే కాకుండా సినిమాకు తెగ బజ్ ఏర్పడుతుందని దర్శకులు వాదిస్తున్నారు.
ఇదే ఐడియాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తాను ఎన్టీఆర్ తో చేయబోయే తదుపరి మూవీకి కూడా అనుసరిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తవగానే తారక్ వెంటనే కొరటాల శివ సినిమా చేయనున్నాడు. కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ సెట్స్ లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఆచార్య మూవీ పూర్తవకముందే కొరటాల తన తదుపరి చిత్రం కోసం వేసిన ప్లాన్ మామూలుగా లేదని పలువురు అంటున్నారు.
కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో పాటు మరో హీరో కూడా నటించడం విశేషం. ఇప్పుడు కూడా తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం కొరటాల ఇదే ఆలోచన చేస్తున్నాడట.