సమంత నాగ చైతన్య ను మ్యారేజ్ చేసుకున్నా తర్వాత లేడి ఓరియెంటెడ్ మూవీలు మాత్రమే చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో టెర్రరిస్ట్ గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. లీడ్ రోల్ లో మనోజ్ బాజ్ పాయ్ నటించాడు. ఆయనకు భార్య గా ప్రియమణి నటించింది.
ఈ క్రమంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రమోషన్ కార్యక్రమంలో సమంత బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లు ఫ్యామిలీ ఇవ్వని సమంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. అలాగే ఇంస్టా వేధిక అభిమానుల కోసం పర్సనల్ ఫోటోస్, నాగ చైతన్య తో దిగిన ఫ్యామిలీ ఫోటోస్, లైవ్ చిట్ చాట్స్ లతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
పెళ్లి తర్వాత ఆమె చేసిన కొన్ని ఫోటో షూట్స్ పై అక్కినేని అభిమానులు, నెటిజన్స్ , బాగా ట్రోల్స్ చేశారు. పెళ్లి తర్వాత పద్దతిగా ఉండొచ్చుగా. అలాంటి డ్రెస్స్ లు ఏమిటి. అల ఫోటోలు ఎవరైనా దిగుతార అంటూ రకరకాలుగా కామెంట్స్ వచ్చేవి వాటి గురించి ఓ అభిమాని సమంత లైవ్ చిట్ చాట్ లో ప్రశ్నించగా. అప్పుడు సమంత అందుకు సమాదానం చెబుతూ అలాంటి వాటివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపెదాన్ని, కోపం బాగా వచ్చేది.
ఆ కోపమే ఇప్పుడు క్రమక్రమం గా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అలాంటి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుందని సమంత జవాబు ఇచ్చింది. సమంత తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఆహా లో ఆమె సామ్ జామ్ అనే టాక్ షో నుకూడా చేస్తుంది. అక్కినేని కోడలుగా సమంత లైఫ్ లో చాలా బిజీగా ఉంది