టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్దన్న వివాదం కొనసాగుతోంది. ఇండస్ట్రీ పెద్దన్న గా నేను ఉంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అది నాకు వద్దు నేను ఏదైనా అవసరం ఉంటే నా వంతు సహకారం అందించేందుకు సిద్దంగా ఉంటాను అన్నట్లుగా చిరంజీవి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెద్దన్న గా తాను ఉండేందుకు ఆసక్తిగా లేను అంటూ వ్యాఖ్యలు చేసిన వెంటనే మోహన్ బాబు స్పందించాడు.
తాను ఇండస్ట్రీ కోసం గతంలో వాళ్లను వీళ్లను బతిమిలాడాను. నా వల్లే ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగి పోయాయి అంటూ ఆయన లేఖ లో పేర్కొన్నాడు. ఇక లేఖ లో ఆయన అందరం కలిసి ఈ సమస్య కు పరిష్కారం చూసుకుందాం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. మోహన్ బాబు లేఖ రాసి రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు సి కళ్యాణ్ మినహా మరెవ్వరు కూడా స్పందించలేదు. సి కళ్యాణ్ మాత్రమే మోహన్ బాబు ముందు నడిస్తే తాము అంతా కూడా ఆయన వెనుక ఉండేందుకు సిద్దం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. కాని ఇతరులు ఎవరు కూడా మోహన్ బాబు ఆశించినట్లుగా నువ్వు నడువు నీ వెనుక నేను ఉంటాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేయలేదు. దాంతో మోహన్ బాబు ప్లాన్ బెడిసి కొట్టింది. ఆ కారణంగానే టికెట్ల విషయమై ఏపీ సీఎంతో మాట్లాడేందుకు ఆయన మళ్లీ రాకపోవచ్చు అంటున్నారు.
ఆయన మళ్లీ మీడియా ముందుకు ఎప్పుడు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియాలో ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి స్పందించడం మాట్లాడటం తప్ప చేసేది ఏమీ లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు. ఆయన నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఒరిగింది ఏమీ లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి ఉన్నంత గౌరవం ఇండస్ట్రీలో ఆయనకు లేదు అనేది అందరికి తెల్సిందే. కనుక ఆయన్ను పెద్దగా ఏ ఒక్కరు ఒప్పుకోక పోవచ్చు అనేది మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.