గత ఏడాది భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ ఏడాది మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నేడు విలక్షణ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత థియేటర్లలో ఈ సినిమాను చూడాలని అనిపిస్తుంది అంటూ జక్కన్న చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ మరియు టీజర్ సినిమా రేంజ్ ను పెంచాయి. ఈ సినిమా మరి అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
టెర్రరిస్టుల బాంబ్ బ్లాస్ట్ లో 40 మృతి చెందుతారు. ఆ బ్లాస్ట్ కు కారణం అయిన టెర్రరిస్టులకు సహకరించినందుకు గాను ఆధిత్య(నితిన్) కు కోర్టు విచారణ తర్వాత ఉరి శిక్ష విధిస్తుంది. నిర్దోషిని అయిన తనను ఈ కేసులో ఇరికించారు అంటూ ఆధిత్య పై కోర్టుకు వెళ్తాడు. పై కోర్టులో ఆధిత్య కేసును వాదించేందుకు మానస(రకుల్) ముందుకు వస్తుంది. జైల్లో ఉన్న సమయంలో శ్రీమన్నారాయణ వద్ద చెస్ నేర్చుకుని ఏకంగా మాస్టర్ అవుతాడు. జైల్లో చెస్ నేర్చుకున్న ఆధిత్య తనను తాను నిర్ధోషిగా నిరూపించుకున్నాడా? అసలు ఆ కేసులో ఆధిత్య ఎలా చిక్కాడు అనే విషయాలను వెండి తెరపై ‘చెక్’ చూసి తెలుసుకోండి.
విశ్లేషణః
దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి సినిమా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. అభిమానుల ఆసక్తికి తగ్గట్లుగానే ఈ సినిమా ప్రత్యేకంగా ఉంది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. నితిన్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీయడంతో పాటు అద్బుతమైన నటుడు నితిన్ లో ఉన్నాడని ప్రేక్షకులు తెలుసుకునేలా చేశాడు. నితిన్ ఈ పాత్రకు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. ఒక గ్రాండ్ మాస్టర్ తరహా పాత్రలో మరియు ఖైదీ గా రొమాంటిక్ బాయ్ గా నితిన్ కనిపించి మెప్పించాడు. అన్ని విధాలుగా నితిన్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు.
ఇప్పటి వరకు హీరోయిన్ గా మెప్పించిన రష్మిక మొదటి సారి నటిగా మెప్పించింది. లాయర్ మానస పాత్రలో ఆమె నటించి ఆకట్టుకుంది. ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర పరిమితంగా ఉంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కథను ఇంకాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ తో నడిపి ఉంటే బాగుండేది. మొత్తంగా పర్వాలేదు అన్నట్లుగా ఈ సినిమా సాగింది. మొదటి సగం ఇంట్రెస్టింగ్ గా సాగగా రెండవ సగం కాస్త బోరింగ్ గా అనిపించింది. క్లైమాక్స్ కాస్త పర్వాలేదు. ఎడిటింగ్లో లోపాలు ఉన్నాయి. సినిమా లో కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సంగీతం పరంగా పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో కొన్ని ట్విస్ట్ లు బాగానే ఉన్నా ఓవరాల్ గా స్క్రీన్ ప్లే పర్వాలేదు అన్నట్లుగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
నితిన్ నటన,
రకుల్ ప్రీత్ సింగ్,
ట్విస్ట్‌లు,
ఫ్రీ క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్,
ఎడిటింగ్,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం
చివరగా…
నువ్వు నితిన్ అభిమాని అయితే ఒక సారి చూడవచ్చు, కాదంటే నీ ఇష్టం.
రేటింగ్: 2.5/5.0