హీరోయిన్ రాశి 90’s లో ఓ వెలుగు వెలిగిన తార. ఆనాటి తారలకు పోటీగా సినిమాల్లో రానించింది. వరస విజయాలను సొంతం చేసుకుంది. ఆమె నటించిన స్నేహితులు, గిల్లీ కజ్జలు, గోకులంలో సీత, మనసిచ్చి చూడు, దేవుళ్ళు ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషల చిత్రాల్లో నటించింది.
స్టార్ హీరోయిన్ పేరును సంపాదించుకున్న క్రమంలో మలయాళం సినిమా పరిశ్రమకు చెందిన శ్రీ ముని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమకు దూరం అయింది. మరల సినిమాలోకి తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేసింది. కానీ అనుకున్నంత రేంజ్ లో మాత్రం పేరు రావడం లేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆమె తేజ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం చిత్రంలో నెగటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటించడంతో సినిమా ఇండస్ష్ట్రి దృష్టి లో ఆమెపై నెగటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది.
అదే కాకుండా చాలా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. ఈ రెండింటితో ఆమెకు సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశాలు తగ్గిపోయాయి. ఇక రాశి కూడా మునపటిలాగా కాకుండా చాలా బరువు పెరిగిపోయింది. 2017 లో లంక అనే సినిమాలో మెయిన్ లీడ్ లో నటించింది కానీ ఆ చిత్రం నిరాశ పరచడంతో ఇక హీరోయిన్ గా అవకాశాలను వదిలేసుకుంది. ప్రస్తుతం బుల్లితెర పై మెయిన్ లీడ్ రోల్స్సి… సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తుంది.