మెగా డాటర్ నిహారిక పెళ్లి అట్టహాసంగా జరిగింది. (డిసెంబర్ 9) నిహారిక- చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరి వివాహం జరుగగా..మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులు పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నిహారిక పెళ్లికి సంబందించిన హైలైట్స్ ఒక్కోటిగా బయటకు వస్తూ మీడియా లో హైలైట్ అవుతున్నారు. తన కూతురి పెళ్లి కోసం నాగబాబు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యముగా పెళ్లి లో నిహారిక కట్టుకున్న చీర గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దాని ఖరీదు ఆ రేంజ్ లో ఉండడమే. బంగారు తీగలతో తయారుచేసిన ఈ చీర ఖరీదు ఏకంగా రూ.20లక్షలంట. పెళ్లికి నెల రోజులు ముందే ఈ చీరను ఆర్డర్ చేసి ప్రత్యేకంగా తయారు చేయించారట. అందుకే అంత ఈ చీర గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ పెళ్లి సందర్భంగా మెగా హీరోలందరూ నిహారికకు ఖరీదైన బహుమతులు అందజేశారట. వీటి విలువ సుమారు రూ.5-6కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పెళ్లికి ముందే కాదు పెళ్లి తర్వాత కూడా మీడియా లో నిహారిక హైలైట్ అవుతుంది.