మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చారు మెగాస్టార్.
2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఈ మూవీతో తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని.. ఆ గ్రేస్, ఆ డ్యాన్స్, ఆ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ తనలో అలాగే ఉందని చాటి చెప్పారు. ఖైదీ నంబర్ 150 మంచి హిట్ అందుకోవడంతో చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమైంది. తర్వాత చిరు సినిమా మరేది రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ తెరకెక్కింది. నిర్మానాంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా కారణంగా ఆచార్య వాయిదా పడుతు వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఆచార్య సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్నారు మెగస్టార్. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. మరో వైపు గాడ్ ఫాదర్ అనే సినిమా పట్టాలపై ఉంది. దాని తర్వాత బోళా శంకర్ మూవీ సిద్ధం అవుతోంది. ఈ చిత్రాలతో పాటు దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే చిరు ప్రకటించారు.
చిరంజీవి-బాబీ చిత్రానికి వాల్తేరు మొనగాడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇదే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నాయి సినీ వర్గాలు. వాల్తేరు మొనగాడు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.