కరోనా సమయంలో వి సినిమాను రిలీజ్ చేసి నిరాశ పరిచిన నాని ఎలాగైనా హిట్ కొట్టాలని వరసగా సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే శివ నిర్వహణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ చిత్రం విడుదల కు సిద్దంగా ఉన్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విజృంబిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల వాయిదా వేస్తున్నట్లు నాని అండ్ టీమ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది పీరియాడికల్ నేపథ్యం కలిగిన చిత్రం గా రూపొందుతుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వివేకా ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఈ చిత్రంలో మలయాళం హీరోయిన్ నజ్రియ నటిస్తుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ కు విచ్చేసింది.
ఓ పది రోజులు షూటింగ్ లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత అంటే సుందరానికి టీమ్ కు ప్యాక్ అప్ చెప్పి కేరళ కు చెక్కేసింది. అందుకు కారణం ఇక్కడ విపరీతమైన కరోనా కేసులు పెరగడమే అని సమాచారం. ఈ విషయం చిత్ర దర్శకుడుకు చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆ టీమ్ చేసేది ఏమి లేక మిగతా పోర్షన్ ను షూట్ చేస్తున్నారు. నజ్రియ లేని సన్నివేశాలను చక చక పూర్తి చేస్తున్నారు. కరోనా పెరిగితే షూటింగ్ లు మూత పడే అవకాశం ఉంది అందుకే త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.