తెలుగు సీనియర్ హీరోలకు కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్స్ చాయిస్ గా మిగిలారు. ఇలాంటి పరిస్థితి ఒక్కప్పుడు లేదు. చిరంజీవి తో నయనతార మరో సినిమా లో నటించనున్నది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “సైరా నరసింహా రెడ్డి” అనే చిత్రం వచ్చింది. నరసింహ రెడ్డి కి భార్యగా సిద్దమ్మ అనే పాత్రలో నటించింది. మలయాళం లూసిఫర్ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగు నేటివిటీకి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు. ఈ చిత్రంలో నయనతార ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గ ఉండనున్నదని సమాచారం అందుకే నయన్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ పాత్రను, హీరో పాత్రతో సమానంగా చూపించే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార తెలుగు రీమేక్ లూసిఫర్ లో నటిస్తుండటంతో అటు తమిళ అభిమానులు కూడా ఈ సినిమా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ చిత్రంలో పవర్ ఫుల్ డైలాగులో ఉండనున్నాయని అందుకోసం ప్రముఖ రచయతలు సాయిమదవ్ బుర్ర, ఆకుల శివ లు ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో లూసిఫర్ తెలుగు రీమేక్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల చివరి నాటికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళుతుంది. చిరంజీవి 153 వ చిత్రంగా ఇది రాబోతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. ఈ చిత్రం మే 13 న విడుదల అవ్వుతుంది.