మలయాళం సూపర్ హిట్ట్ మూవీ లూసిఫర్. ఆ చిత్రంలో మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హీరో కం నిర్మాత రామ్ చరణ్ లూసిఫర్ హక్కులను దక్కించుకున్నాడు. తెలుగు రీమేక్ లో చిరంజీవి కథానాయకుడి గా నటిస్తాడు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాంచరణ్, నిరంజన్ రెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చర్రి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈనెల 21 నుండి లూసిఫర్ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేస్తారు. ఈ రీమేక్ చిత్రాన్నికి దర్శకుడు ఎవరు అనేదానిపై చాలా సమయం పట్టింది. ఎంతో మంది దర్శకులను పరిశీలించిన పిమ్మట చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజ చేతిలో రీమేక్ భాద్యతలు పెట్టాడు చరణ్.
ఇప్పటికే స్క్రిప్ట్ ను పూర్తి చేసి సిద్దంగా ఉన్నాడు దర్శకుడు. తెలుగు నేటివిటీ కి తగిన విదంగా మార్పులు చేర్పులు చేశారు. ఒరిజినల్ లూసిఫర్ లో మోహన్ లాల్ కి జోడీగా ఏ హీరోయిన్ నటించలేదు. కానీ తెలుగు లో హీరోయిన్ పాత్ర కోసం స్పెషల్ క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. తెలుగు రీమేక్ లూసిఫర్ లో చిరంజీవి సరసన తమిళ హీరోయిన్ నయనతార నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈమె గతంలో బాస్ తో సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటించింది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. హీరోయిన్ గా రానిస్తుంది. నయనతార విషయమై చిత్రం బృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.