సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ నయనతార ప్రేమ విషయంలో ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంది. గత దశాబ్దంనర కాలంగా ఈమెను ప్రేమ విషయమై మీడియా వేదిస్తూనే ఉంది. మొదట శింబును ఈమె ప్రేమించింది. ఇద్దరి మద్య కుదరక పోవడంతో విడిపోయారు. వారిద్దరి ప్రేమ కొద్ది కాలం మాత్రమే సాగింది. శింబుతో విడిపోయిన కొంత కాలానికే ప్రభుదేవాతో ప్రేమలో పడింది.
ప్రభుదేవాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. ముహూర్తం కూడా పెట్టిన సమయంలో అనూహ్యంగా ప్రభుదేవా భార్య తెరపైకి వచ్చి మొత్తం రచ్చ రచ్చ చేసింది. దాంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు వదిలేయానుకున్న నయన్ మళ్లీ సినిమాలు మొదలు పెట్టింది. ప్రభుదేవాతో పెళ్లి కాకపోవడంతో సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు మళ్లీ కొన్నాళ్లకే ప్రేమలో పడింది.
ఈమె ప్రేమ విషయం మొదట్లో పలు రకాలుగా పుకార్లు వినిపించాయి. వాటిపై పెద్దగా స్పందించలేదు. ఇప్పటి వరకు ప్రేమ విషయాన్ని బాహాటంగా చెప్పలేదు. కాని ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని వెళ్లడం మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నయనతార మరియు విఘ్నేషన్ లు ఓనం పండుగ కోసం కేరళ వెళ్లారు. అక్కడ ఓనం జరుపుకున్న ఫొటోలు కూడా షేర్ చేశారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం వీరిద్దరు అస్సలు ఆసక్తిగా ఉన్నట్లు అనిపించడం లేదు.
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం ఉందా లేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈమె సన్నిహితుల వద్ద చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్నాయి. రెండు నుండి నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆమె అంటుంది. సినిమాల్లో ఆఫర్లు రానప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటోంది.
ప్రస్తుతం వీరిద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరికి పెళ్లి అయ్యింది కాని బయటకు చెప్పడం లేదని అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆ భగవంతుడికి మరియు వారిద్దరికి మాత్రమే తెలియాలి.