
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి అభిమానులను ఆనందపరిచాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో సినిమా అనగానే అందరిలో అంచనాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాలూకా అనేక వార్తలు బయటకు వస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ లో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర నటిస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. నవీన్ చంద్రది బాలయ్య తమ్ముడి క్యారెక్టర్ అని తెలుస్తోంది. తమ్ముడ్ని చంపేసాక బాలయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, వారి పై పగ ఎలా తీర్చుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ అని చెపుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.