కరోనా కారణంగా ఇండియాలో మార్చి రెండవ మూడవ వారం నుండి థియేటర్లు మూత పడ్డాయి. లాక్ డౌన్‌కు ముందే థియేటర్లు స్వచ్చందంగా మూత వేయడం లేదా ప్రభుత్వాలు మూసేయాలంటూ ఆదేశించడం చేశాయి. అప్పుడు మూత పడ్డ థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకున్న పాపన పోలేదు. దాంతో కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను థియేటర్ల ఓపెన్ కోసం వెయిట్ చేసి వాయిదా వేస్తే ఆర్థికంగా భారీ నష్టాలు మెవడే అవకాశం ఉందని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటిస్తున్నారు. చాలా మంది నిర్మాతలు ఈ దారి పడుతున్న నేపథ్యంలో నాని ‘వి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
నాని 25వ చిత్రం అదీ కాకుండా నాని ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. దాంతో ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో సుధీర్‌బాబు హీరోగా నటించాడు. నివేదా థామస్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కాని థియేటర్లు మూత పడటంతో వాయిదా వేశారు. దిల్‌రాజుకు ఉన్న ఆర్థిక పరిపుష్టత కారణంగా సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మళ్లీ ఏం జరిగిందో ఏమో కాని సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
సెప్టెంబర్‌లో ఈ సినిమాను మంచి సమయం చూసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల వారు ప్రకటించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ఓటీటీలో అయినా చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఓటీటీ మూవీలు ఈమద్య కాలంలో చాలా విడుదల అయ్యాయి. దానికి తోడు వారు భారీ ప్రైజ్ ను ఆఫర్ చేయడంతో దిల్‌రాజు కాదనలేక పోయాడు. పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వస్తున్న నేపథ్యంలో దిల్‌రాజు కాదనలేక పోయాడట. ఈ చిత్రంతో సుధీర్‌బాబు సక్సెస్ దక్కించుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.