సంక్రాంతికి టాలీవుడ్ లో రాబోతున్న ఒకే ఒక్క పెద్ద సినిమా నాగార్జున మరియు నాగ చైతన్య నటించిన బంగార్రాజు . ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వల్ల నైట్ కర్ఫ్యూ విధించి ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
నైట్ కర్ఫ్యూ వల్ల సినిమా థియేటర్లు కేవలం రెండు లేదా మూడు షో లు మాత్రమే పడే అవకాశం ఉందని అంటున్నారు. తద్వారా భారీగా నష్టం కలుగుతుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా వాయిదా వేసే అవకాశాలు కూడా వార్తలు వచ్చాయి. బంగార్రాజు సినిమా వాయిదా విషయమై చర్చలు జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను వాయిదా వేస్తున్నట్లు గా ప్రకటించింది.
సంక్రాంతి సీజన్ అవ్వడం వల్ల నైట్ కర్ఫ్యూ విధించడం వల్ల జనాలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఉద్దేశం ఏదైనా ఈ నిర్ణయంతో బంగార్రాజు కలిసి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో బంగార్రాజు సినిమా ఒక బంగారు బాతుగా భారీ వసూళ్లను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య కు జోడిగా ఈ సినిమాలో ఉప్పెన సినిమాలో నటించిన హీరోయిన్ కృతి శెట్టి నటించగా మరో హీరోయిన్గా జాతిరత్నాలు హీరోయిన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని నాగార్జున నిర్మించడం జరిగింది.