నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో యంగ్ హీరో నాగ శౌర్య కూడా కనిపించబోతున్నాడట. ఆదిత్య 369, సమ్మోహనం, వంశానికొక్కడు వంటి చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా..కుమారి 21 ఎఫ్ సినిమాను కన్నడంలో రూపొందించిన దర్శకుడు శ్రీమన్ వేముల ఈ సినిమాకు కథ అందిస్తున్నది.
ఈ సినిమాలో శౌర్యది నలభై నిమషాల కీలక పాత్ర అని తెలుస్తోంది. సినిమా మొత్తం శౌర్య మూగ-చెమిటి వాడిగా వుంటాడని ..అయితే ఈ పాత్ర ఎమోషనల్ గా కాకుండా ఫన్ తో వుంటుందని బోగట్టా. బాలకృష్ణ పాత్ర పూర్తి నిడివితో శౌర్య పాత్ర ఉంటుందని అంటున్నారు. కాకపోతే ఈ సినిమాను బాలయ్య ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనేది సస్పెన్స్ గా ఉంది.