అల్లరి నరేష్ కామిడి సినిమాలకు పెట్టింది పేరు వరస విజయాలతో సక్సెస్ ఫుల్ గా సాగిపోయిన కెరీర్, ఆ తర్వాత వరస పరాజయాలు ఎదురు కావడంతో సినిమా లైఫ్ మొత్తం అస్థవ్యస్థం గా మారిపోయింది. ఇక లాభం లేదు అనుకోని తన అన్న ఆర్యన్ రాజేశ్ లాగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన సోలోగా కామిడి టచ్ కు దూరం గా ఉంటూ ఓ డిఫ్ఫరెంట్ మూవీ తో వచ్చాడు. అదే నాంది. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ అండర్ ట్రయల్ ఖైదీ గా నటించాడు. ఏ తప్పు చేయని నరేష్ జైల్లో ఖైదీ గా బందీ అవ్వుతాడు. ఆ క్రమంలో ఆయన ఎదురుకున్న సంఘటనలను బేస్ చేసుకొని సినిమా గా మలిచాడు విజయ్. ఈ చిత్రం మొన్న శనివారం నాడు విడుదలైంది మొదటి అట నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్, తదితరులు నటించారు. ఇటీవలే ఈ చిత్రాని చూసిన క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని నరేష్ మరియు ఇతర తారాగణంపై పొగడ్తల వర్షం కురిపించాడు. సస్పెన్స్ తో ఈ చిత్రం ఆకట్టుకుందని కితాబు ఇచ్చాడు.
మూడు రోజులకు గాను ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ వివరాలు… 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటింది ఈ సినిమా. మూడురోజులకు గాను నైజాం- 93 లక్షలు, సీడెడ్- 29 లక్షలు, ఉత్తరాంధ్ర- 19 లక్షలు,ఈస్ట్ గోదావరి- 16 లక్షలు, వెస్ట్ గోదావరి- 12 లక్షలు, గుంటూరు- 17 లక్షలు, కృష్ణా- 18 లక్షలు, నెల్లూరు- 10 లక్షలు వాసులు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూల్ చేసింది నాంది. ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్ లోనే చాలా పెద్ద విజయం ఆఫ్టర్ సుడిగాడు చిత్రం తర్వాత. ఇక నుండి కామిడి టచ్ ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా ఇలా డిఫరెంట్ కథలను కూడా చేయాలని అల్లరి నరేష్ అనుకుంటున్నాడు.