జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్… బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు స్టార్ మా లో కామిడి స్టార్స్ అనే షో లో కామిడి స్కిట్స్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న నేమ్ ను అవినాష్ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అవినాష్, అరియాన, శ్రీముఖి, విష్ణు ప్రియలు మరియు కొంతమంది స్నేహితులు కలిసి గోవ టూర్ కు వెళ్లారు.
ఈ క్రమంలో వారు సెల్ఫీలు, ఫోటోలు, వీడియో లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. అందులోని ఓ వీడియో లో ముక్కు అవినాష్ అరియాన తో గర్ల్ ఫ్రెండ్ తో రావాలిసింది అనవసరంగా ఫ్రెండ్ తో వచ్చాను అని అంటాడు. అందుకు అరియాన కూడా బాయ్ ఫ్రెండ్ తో రావాలిసింది అనవసరంగా ఫ్రెండ్ తో వచ్చాను అంటుంది. వీళ్ళ మాటలను బట్టి చూస్తుంటే వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో అవినాష్, అరియాన లు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ సమయంలో వారు లవ్ లో ఉన్నట్లుగా బిగ్ బాస్ వీక్షకులు భావించారు. షో నిర్వాహకులు కూడా ఆవిదంగానే ప్లాన్ చేశారు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కూడా వారు కలిసి తిరగడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనుకున్నారు. కానీ రీసెంట్ గా గోవ వెళ్ళిన సమయంలో వారు మాట్లాడుకున్న మాటల వీడియో ఒక్కటి లీక్ అవ్వడంతో అవ్వని ఉత్తి పుకార్లే అని తేలిపోయింది.