‘సుడిగాడు’ చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన మోనాల్ గజ్జర్..తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ భాషల్లో కలిపి సుమారు 20 చిత్రాల్లో నటించింది. అయితే 20 చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులర్ కానీ ఈమె బిగ్ బాస్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో..ప్రస్తుతం 4 సీజన్ జరుపుకుంటుంది. మరో వారం రోజుల్లో ఈ షో ముగుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామరస్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంటరైన మోనాల్.. గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో 98 రోజులు గడిపింది.
బిగ్ బాస్ దెబ్బకు ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మోనాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీ అయిపొయింది. ఇందులో భాగంగానే మోనాల్ తనకు కాబోయే భర్త విషయంలో తన మనసులోని మాట చెప్పి షాక్ ఇచ్చింది. సహజంగా అందరూ రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటారని, కానీ తాను మాత్రం కృష్ణుడు లాంటి మొగుడు కావాలనుకుంటానని చెప్పుకొచ్చింది.
బేసికల్ గా తాము వైష్ణవులమని, అందుకే కృష్ణుడిని పూజించడం మొదటి నుండి అలవాటని, అలానే ప్రతి మాటకూ ముందుకు జై కృష్ణ అనడమూ చిన్నప్పటి నుండే అలవడిదని చెప్పింది మోనాల్. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీరాముడు సీతాదేవిని వదిలిపెట్టాడం బాధకలిస్తుండేదని, ఒకవేళ ఆయన తన ముందుకు వస్తే… ‘ఎందుకలా చేశావని’ అడగాలని ఉండేదని మోనాల్ చెబుతోంది. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నా… కోట్లాదిమంది ఇప్పటికీ ఆయన్ని భక్తిభావంతో పూజిస్తున్నారని, కాబట్టి కృష్ణుడులాంటి మొగుడినే తాను కోరుకుంటున్నానని తెలిపింది.