
ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం, అభినయంతో.. అభిమానులకు దగ్గరై అందాల తార రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె ప్రస్తుంత రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ జబర్దస్త్ షోల్ జడ్జీగా వ్యవహరిస్తూ… తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.

ఈ మధ్య ఎమ్మెల్యే రోజా సినిమాల్లో కనిపించట్లేదు. కానీ జబర్దస్త్ షో ద్వారా మాత్రం ప్రతి రోజూ కనిపిస్తు అలరిస్తోంది. ఈ షో ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఈమె.. తన మనసులోని మాటను తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రోజా డెరెక్టుగా కాకుండా జబర్దస్త్ షోలోని ఓ స్కిట్ ద్వారా తెలపారు. ఇందుకు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది టీం.. ఎమ్మెల్యో రోజా ఇంటికి వెళ్లారు. అయితే అక్కడి హాల్లో ఉన్న ఓ వెంకటేశ్వర స్వామి ఫొటోని చూసిన ఆది.. దేవుడిని మీరేం కోరుకుంటారని ప్రశ్నించగా… సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి.. మిల్క్ బాయ్ మహేష్ తో ఓ సినిమాలో నటించాలని ఉందంటూ చెప్పింది. అయితే మరి ఆమె ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.