పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న కారణంగా ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమా పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది అంటూ పవన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కోపం మరియు ఆయన క్రేజ్ ను చూసి తట్టుకోలేక వకీల్ సాబ్ సినిమా థియేటర్ల విషయంలో గందరగోళం సృష్టించారు. అసలు మార్నింగ్ షో లు వేయకుండా వైకాపా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇక టికెట్ల రేట్ల విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంత్రి పేర్ని నాని వకీల్ సాబ్ ను పాచిపోయిన సినిమా అంటూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
మంత్రి గారు అన్నట్లుగా ఇది పింక్ కు రీమేక్ నిజమే. కాని ఇది ఒక గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే విషయాన్ని ఆయన మర్చిపోయారా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఆడవారి పట్ల జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ సినిమా విషయంలో ఆయన మాట్లాడిన తీరు అత్యంత దారుణంగా ఉందంటూ పవన్ లేడీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ల సమస్యల పట్ల పోరాటం చేసే వ్యక్తి కథను తీసుకు వస్తే ప్రభుత్వం పన్ను రాయితీ లేదా మరో రాయితీ ఇచ్చి సినిమాను ఎక్కువ మంది చూసేలా చేయాలి. కాని మంత్రి గారి మాటలు మరీ దారుణంగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అయినా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీపై మంత్రి విమర్శలు చేస్తుంటే మహిళ సంఘాల నాయకులు ఎక్కడ ఉన్నారు అంటూ జనసేన కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని పాచిపోయిన సినిమా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పై మహిళ సంఘాల వారు తీవ్రంగా స్పందించాల్సింది పోయి కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ వంటి ఒక మంచి మెసేజ్ సినిమా పై మంత్రి నాని మాత్రమే కాదు ఎవరు వ్యాఖ్యలు చేసినా కూడా తీవ్రంగా అయితే మా వంతు మేము ఖండిస్తున్నాం. సగటు సినీ ప్రేమికుడిగా మంత్రి గారి వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఆయన ఈ సినిమా విషయంలో తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటే బాగుంటుంది. పవన్ అభిమానులు అంతా కూడా ఆయనపై బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఆయన మాటలను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయాలి.