బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి. మీజాన్ జాఫేర్రి ల మద్య గత కొంతకాలం గా ప్రేమ వ్యవహారం నడుస్తుందని, బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇన్ని రోజులనుండి ఎవరు స్పందించలేదు. అయితే నిజంగానే వారి మద్య ఏదో నడుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో మీజాన్ జాఫేర్రి తండ్రి జావేద్ జాఫేర్రి స్పందించాడు.
ఒకానొక సందర్భంలో ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… సోషల్ మీడియా, బాలీవుడ్ మీడియా మా రెండు కుటుంబాల మీద అత్యుత్సాహం చూపిస్తున్నాయి. నవ్య నవేలి, మీజాన్ జాఫేర్రి ల మధ్య ప్రేమ గీమ ఏమి లేదు. వారు మంచి స్నేహితులు మాత్రమే. చిన్నతనం నుండి వాళ్ళు ఫ్రెండ్స్. స్కూల్స్, కాలేజీ లలో కలిసి చదవుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు క్లోజ్ గా ఉండటం చూసి దానిని ప్రేమ అనుకోవడం పొరపాటు అవ్వుతుంది. వాళ్ళు మంచి స్నేహితులు మాత్రమే అని అన్నారు.
వాళ్ళకి వారి హద్దులు తెలుసు ఏనాడు కూడా వాటిని దాటి ప్రవర్తించలేదు. కొందరు కావాలనే పుట్టించిన పుకార్లు అని అన్నాడు. ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుండి ఎవరు స్పందించడం లేదు. అలాగే నవ్య నవేలి, మీజాన్ జాఫేర్రి లు ఈ విషయంపై స్పందించకపోవడంతో పలు అనుమానాలకు దారి తీసే అవకాశం ఉంది. సోషల్ మీడియా అయిన ఇంస్టాలో నవ్య నవేలి నంద కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మద్య ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో ను ఒక్కటి షేర్ చేసి వైరల్ చేసింది. (సెక్సీజం గురించి ఓ వీడియో కాన్ఫ్రెన్స్ లో విలేకరి అడిగిన ప్రశ్నకు సంబందించింది). మీజాన్ జాఫేర్రి బాజీరావు మస్తానీ సినిమా కు అస్సిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.