మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు..తాజాగా మీడియం బడ్జెట్ మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు సెట్స్ ఫై చిరంజీవి తో ఆచార్య , నాగార్జున తో వైల్డ్ డాగ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు శ్రీ విష్ణు ను హీరోగా పెట్టి ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో తమ తొమ్మిదో చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. కేపర్ కామెడీగా రూపొందే ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూరుస్తుండగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్, ‘రంగస్థలం’ మహేష్, రాజ్‌కుమార్ చౌదరి (‘రాజావారు రాణిగారు’ ఫేమ్), చైతన్య (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్) నటిస్తున్నారు.