బుల్లితెరపై మేల్ సుమగా పేరొందిన యాంకర్ ప్రదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో షోలతో.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు . అయితే రేడియో జాకీగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్… బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టాడు. మొదటగా గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రామ్ చేసి… తన సత్తా చాటుకున్నాడు.
అలా అటు ఆడవాళ్లలోనూ, ఇటు మగ వాళ్లలోనూ క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన… ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఒక్కటేమిటి పెద్ద పెద్ద షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే అతను ఎక్కడికి వెళ్లినా అతని ఎదురయ్యే ప్రశ్న .. పెళ్లి. 34 ఏళ్ల వయుసొచ్చినా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడమే అందుకు కారణం.
అయితే ప్రదీప్ పెళ్లి గురించి ఇంతకు ముందు చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ఆయన అవన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశారు. ఇప్పుడే తను పెళ్లి చేసుకోవట్లేదని తెలిపారు. అయితే తాజాగా మాత్రం ప్రదీప్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతురును ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెళ్లికి సంబంధించిన చర్చలు ఎంత వరకు వచ్చాయో తెలీదు కానీ… ఆల్ మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తన పెళ్లి గురించి ప్రదీప్ యే అఫీషియల్ గా ప్రకటిస్తారట. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యాంకర్ ప్రదీప్ త్వరలోనే ఓ ఇంటి వాడు అవ్వబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.