సినిమా టికెట్ ధరల పెంపు విషయంపై ఎన్నో రోజులుగా ఏపీలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ నోరు మొదపని మా అధ్యక్షుడు మంచు విష్ణు… మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ను కలవగానే మీడియా ముందుకు వచ్చారు. పర్సనల్ అంటూ ఏవేవో కామెంట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ముందు పెట్టి.. ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరిపిస్తున్నారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి.. విజయవాడకు వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. దాదాపు గంటన్నర సేపు సినిమా టికెట్ల ధర పెంపు విషయంపై చర్చించారు.
ఇదిలా ఉండగా.. ఎన్నడూ లేనిది మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చి… ఈ విషయంపై నోరు విప్పారు. మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్ ను కలిసి మాట్లాడితే అది పర్సనల్ ఎలా అవుతుందంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా ఈ విషయాలపై ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని… సినిమా పెద్దలంతా కలిసే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అంతేకాకుండా వారు తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామన్నారు.
నాని విషయంలో ఈ వివాదం తలెత్తినప్పుడు ఏ ఒక్కరూ స్పందించలేదు. నాని మీద వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినప్పుడు కూడా నోరు మెదపలేరు. సమస్య పట్ల బాధ్యాతాయుతంగా స్పందిచకపోవడం దారుణం. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తప్ప మరెవరూ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చింరజీవి బయటకు రాగానే… మంచు విష్ణు రావడం ఆసక్తిని కల్గజేస్తుంది.