మంచు మనోజ్ బాల నటుడుగా మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సీనియర్ ఎన్టిఆర్ తో నటించిన ఏకైక యువ హీరో మంచు మనోజ్ ఆ అదృష్టం ఇప్పుడు ఉన్న యువ హీరోలలో ఎవరికి దక్కలేదు. మంచు మనోజ్ హీరోగా పరిచయం అయింది మాత్రం దొంగ దొంగది సినిమాతో.. మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. రాజు భాయ్, వేదం, కరెంట్ తీగ, బిందాస్, నేను మీకు తెలుసా ?, పోటుగాడు.
Mr. నూకయ్య వంటి సినిమాలు అయినకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ప్రణతి రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం మంచిగానే ఉన్న ఆ తర్వాత ఒకరినొక్కరు అర్థం చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు. ఇలాంటి తరుణంలో మనోజ్ పెళ్లి విషయం మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంచు ఫ్యామిలీ కి సంబందించిన అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని.
పెళ్లి పనుల్లో మంచు ఫ్యామిలీ బిజీగా ఉందని వార్తలు వస్తున్న తరుణంలో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. “డేట్ మరియు టైమ్ కూడా మీరే చెప్పండి” అంటూ స్మైల్ ఎమోజస్ ను ఉపయోగించాడు. ప్రస్తుతం మంచు మనోజ్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బాషల్లో విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.