సూపర్ స్టార్ మహేష్ బాబు…మాములు స్వింగ్ లో లేడు. వరుసపెట్టి బ్లాక్ బస్టర్ లు కొడుతూ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్స్మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ‘మహానటి’ కీర్తి సురేష్ కథానాయిక. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్. త్వరలో ఈ మూవీ మొదటి షెడ్యూల్ అమెరికా లో మొదలు కానున్న నేపథ్యంలో..మహేష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గురించి ఇప్పటి నుండే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మొన్నటి వరకు సర్కారు వారి పాట పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో అనగానే అంచనాలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మహేష్ నెక్స్ట్ చేయబోయేది తన లాస్ట్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి అని అంటున్నారు. మరి ఫైనల్ గా మహేష్ ఎవరికీ ఓకే చెపుతాడో అనేది చూడాలి.