టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం యొక్క షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దుబాయి లో జరుపుకుంటుంది. మహేష్, కీర్తి సురేష్ లతో పాటుగా మరికొంత మంది తో అక్కడ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సరిలేరు నీకేవ్వరు చిత్రం తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇది. సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది 2022 న సంక్రాంతి కి విడుదల అవ్వుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమాపై సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి. అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు అని. కానీ తాజా సమాచారం మేరకు ఓ లేడి దర్శకురాలు మహేష్ తో సినిమా చేయాలని భావిస్తుంది అంట ఆమె మరెవరో కాదు సుధా కొంగర. ఈమె తెలుగు దర్శకురాలే కానీ తమిళం నుండి బాగా ఆఫర్స్ రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ తమిళ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో హీరో సూర్యతో సురాయి పోట్రు అనే చిత్రం ను తెరకెక్కించింది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా గా డబ్బ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం తమిళ, తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టు చిత్రం గా నిలిచింది.
సుధా కొంగర, మహేష్ కోసం ఓ కథను సిద్దం చేసిందని.. ఆ కథను మహేష్ కు చెప్పడం జరిగిందని… ఈ లేడి దర్శకురాలి డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి మహేష్ కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి సర్కారు వారి పాట తో కలిపి ఈ చిత్రం ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళుతాడ లేకపోతే రాజమౌళి సినిమా తర్వాత సెట్స్ పైకి వెల్లుతుందా అనే విషయం తెలియాలిసి ఉంది. ఎందుకంటే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే భారీ బడ్జెట్ తో కూడి ఉంటుంది. సమయం కూడా ఎక్కువ పడుతుంది.