సూపర్ స్టార్ మహేష్ బాబు సీక్రెటగా పెళ్లి చేసుకున్నాడనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన అలా ఎందుకు దొంగతనంగా ఎందుకు చేసుకున్నాడో మాత్రం చాలా మందికి తెలియదు. అకేషన్ అని చెప్పి వెళ్లి మిల్క్ బాయ్ పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ విషయం గురించి ఎన్ని ఇంటర్వ్యూల్లో అడిగినా ఆయన నోరు మొదపలేదు. ఆ తర్వాత ఈ విషయం గురించి అందరూ మరిచిపోయారు.
అలా మహేష్ బాబు సీక్రెట్ పెళ్లి కారణమేంటో ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షాలో ఈ విషయం గురించి అడిగారు హీరో బాలకృష్ణ. ఏమయ్యా అకేషన్ అని చెప్పి.. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చావు.. ఎందకలా చేశావంటూ బాలయ్య అడిగారు. అలాగే మాక్కూడా చెప్పాలనిపించలేదా అన్నారు. అందుకు స్పందించిన మిల్క్ బాయ్ మహేష్ బాబు… తెగ సిగ్గు పడిపోతూ సమాధానం ఇచ్చాడు.
అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం జరిగిన విషయం సార్… చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు కానీ అనుకోకుండా అలా జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేష్, నమ్రతల మధ్య అప్పుడే మంచి స్నేహం ఏర్పడింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అలా ఇద్దరూ ఇరు కుటుంబ “సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తన తండ్రి కృష్ణ మాత్రం తన పెళ్లికి అంత ఆజీగా ఒప్పుకోలేదని మహేష్ బాబు చెప్పారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే వీరిప్పుడూ ఎంతో ప్రేమగా ఉంటూ… ఎంతో మంది యువ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.