లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నో భాషలో పాటలు అందరినీ అలరించిన ఆ గాన కోకిల మృతిపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీలు నివాళులర్పించారు. అయితే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ మాత్రం చాలా లేట్ గా స్పందించారు. ఇదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. అసలేమైందో తెలుసుకోవాలనుందా..!
13వ ఏట నుంచే పాటలు పాడుతూ యావత్ దేశ ప్రజల్ని ఉర్రూతలూగించిన సింగర్ లతా మంగేష్కర్ మృతిపై బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో పాటలు పాడిన మధుర గాయని లతా మంగేష్కర్ మనల్ని విడిచి పోవడం దురదృష్టకరమని.. ఆమె లేని లోటును మాటల్లో వర్ణించలేమంటూ తన సంతాపాన్ని తెలిపింది.
అయితే ఇదే లతా మంగేష్కర్ అభిమానులను తీవ్రంగా బాధించింది. గాన కోకిల చనిపోతే మీరు స్పందించేది ఇప్పుడూ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. లతా మంగేష్కర్ పైను మీకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీకు కాస్తైన సంస్కారం ఉందా ఉంటూ ఐశ్వర్యా రాయ్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
అయితే లతా మంగేష్కర్ మృతిపై బాలీవుడ్ కి చెందిన చాలా మంది సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చను, షారూఖ్ ఖాన్, రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్… ఇలా చాలా మందే స్పందించారు. ఉన్నతమైన బచ్చన్ ఫ్యామీలీ సభ్యురాలైన ఐశ్వర్యా రాయ్ ఇంత ఆలస్యంగా స్పందించడం సరికాదంటూ తెగ విమర్శలు చేస్తున్నారు.