‘నేనే మంత్రి నేనే రాజు’ ..సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ..ఆ తర్వాత కాజల్ తో సీత చిత్రాన్ని చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. ఆ తర్వాత రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’.
ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి ప్రతి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యముగా ఈ మూవీ లో హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్వీటీ అనుష్క, నివేద థామస్ , కియారా అద్వానీ , కీర్తి సురేష్ ఇలా పలువురు భామల పేర్లు వినిపించగా..తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి పేరు బయటకొచ్చింది.
ఉప్పెన
సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కృతి. నాని సినిమాలోనూ అవకాశం అందుకుంది. లేటెస్టుగా తమిళ స్టార్ సూర్య సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గోపీచంద్ – తేజ సినిమా అవకాశాన్ని అందుకున్నట్టు టాక్. ఉప్పెన
రిలీజ్ కాకుండానే ఇన్ని అవకాశాలంటే మాటలు కాదు. తొలి సినిమా రాకముందు ఇంత పాపులర్ అయ్యిందంటే..ఒకవేళ ఉప్పెన సూపర్ హిట్ అయితే అమ్మడు టాప్ రేంజ్ కి చేరుకోవడం ఖాయం. మరి నిజంగా ఈమె తేజ సినిమాలో నటిస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.