డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత స్పీడ్ పెంచాడు. వరసగా తను లైన్ లో పెట్టిన సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే రాధా కృష దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రాని పూర్తి చేశాడు. మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. అందులో సలార్ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లింది. హిస్టారికల్ మూవీ రామాయణం చిత్రాన్ని అధిపురుష్ పేరుతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తుంటే సీత పాత్రలో కృతి సనన్ నటించనున్నది. ఈ చిత్రంలోని తన పాత్రపై కృతి సనన్ స్పందిస్తుంది. నా జీవితంలో నాకు ఈ సీత పాత్ర ఎప్పుడు గుర్తిండిపోతుంది. సీత పాత్ర నాకు దక్కడం అదృష్టంగా నేను భావిస్తాను అని అన్నది. అలాగే ఈ చిత్రాని హింది వెర్షన్ తో పాటుగా తెలుగు వెర్షన్ లో ఏకకాలంలో తీస్తున్నారు. అందుకే హీరోయిన్ కృతి సనన్ సొంతంగా తెలుగు టూటర్ ను కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు డైలాగుల్లో స్పస్టత కొరకు ఆమె ముందే జాగ్రత్తలు తీసుకుంటుంది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించనున్నాడు. లక్ష్మణుడు గా సన్నీ సింగ్ నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రం కోసం భారీ విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు. త్వరలోనే ప్రభాస్ అధిపురుష్ షూటింగ్ సెట్ లో సందడి చేయనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ లో నటించనున్నాడు.