పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ నేపథ్యంలో వరస సినిమాలను చేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో మలయాళం మూవీ అయ్యపనుమ్ కొషియమ్ సెట్స్ పైన ఉంది. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రీన్ ప్లే & మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నాడు. బల్లాలదేవుడు (రానా) మరో పాత్రలో నటిస్తున్నాడు.
విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్, పవన్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ను మొదలు పెట్టింది. హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథను పవన్ తో రూపొందించనున్నాడు. ఈ చిత్రానికి “హరి హర వీరమల్లు” అనే టైటిల్ ప్రచారం లో ఉంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు త్వరలోనే ఈ చిత్రం యొక్క టైటిల్, పవన్ లుక్ ను విడుదల చేస్తాడు అని టాక్ వినపడుతుంది. అందుకు శివరాత్రి వేదిక అవ్వనున్నది అని సమాచారం.
ఈ చిత్రం యొక్క కథ కొన్ని శతాబ్దాల కాలంనాటి ది కావున.. క్రిష్ ఆ నేపథ్యం కలిగిన వాతావరణం కోసం ఓ భారీ సెట్ ను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ శివారులో ఛార్మినార్ సెట్ ను నిర్మించాడు. అలాగే మరో భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 17 వ శతాబ్దం నాటి గండికోట సంస్థానం ను భారీ వ్యయం తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓ పది రోజులపాటుగా ఈ సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ గా కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏఎం రత్న భారీ బడ్జెట్ తో ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు.