మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ బాధ్యతలను చరణ్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ప్రస్తుతానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మాత్రమే కొణిదెల బ్యానర్ లో వస్తున్నాయి. అయితే ఫ్యూచర్ లో ఇతర స్టార్స్ తో కూడా ఈ బ్యానర్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేస్తే నటీనటులు, బడ్జెట్ లాంటి విషయాలని కూడా పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో కొణిదెల ప్రొడక్షన్స్ నుండి కూడా స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. బడ్జెట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా చిన్న కాన్సెప్ట్ లని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చేలా కొణిదెల బ్యానర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
ఓ పక్క చిరుతో కొణిదెల బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోపక్క చిన్న సినిమాలని కూడా నిర్మించాలని చూస్తున్నారు. తప్పకుండా ఇది ఆ బ్యానర్ వాల్యూని పెంచే అవకాశం ఉందని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ కూడా గీతా ఆర్ట్స్ 2 అని చిన్న సినిమాలు చేస్తుంది. హారిక హాసిని కూడా సితార బ్యానర్ లో మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తుంది. అదే దారిలో కొణిదెల బ్యానర్ కూడా చిన్న బడ్జెట్ సినిమాలని చేయాలని ప్లాన్ చేస్తున్నారు.