కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది. యశ్ బర్త్ డే సందర్బంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 టీజర్ కు అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 150 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ టీజర్ దుమ్ము రేపుతూనే ఉంది. అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న టీజర్ అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. వివాదాలు అనేవి సినిమాలకు కామన్. కాని ఇప్పుడు టీజర్ కు కూడా వివాదం రావడం అనేది చర్చనీయాంశం అయ్యింది.
కేజీఎఫ్ 2 సినిమా యూనిట్ సభ్యులకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాని ప్రకారం టీజర్ లో హీరో యశ్ సిగ రెట్ తాగుతున్న సమయంలో పొగ తాగడటం ఆరోగ్యానికి హానికరం అని వేయాల్సి ఉంది. కాని అది వేయలేదు. అందుకు కారణంగా ఏంటీ అంటూ తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా టీజర్ లో పొగాకు కు సంబంధించిన హెచ్చరిక వేయక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. వారి నుండి వచ్చే స్పందన ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే సిగరెట్ విషయం ట్రోల్ అవుతుంది. గన్ తో సిగరెట్ కాల్చుకోవడం ఏంట్రా బాబోయ్ అంటూ విమర్శలు వస్తుండగా ఇప్పుడు అదే షాట్ కు సిగరెట్ హెచ్చరిక వేయక పోవడం ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి నోటీసు కూడా అందుకున్నారు. దాంతో టీజర్ విషయంలో ఏం జరుగబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.