
తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతున్న కీర్తి సురేష్ (Keerthy Suresh)ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది. దీనితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా అమ్మడు సిస్టర్ రోల్ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా తమిళంలో ఓ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందట కీర్తి సురేష్.
మహానటి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ లేటెస్ట్ గా తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో జత కడుతుందట. మారి సెల్వరాజ్ డైరక్షన్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తమిళంలో దళపతి విజయ్, రజీకాంత్ సినిమాల్లో కూడా నటించిన అమ్మడు ఇప్పుడు యువ హీరో ఉదయనిధి స్టాలిన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. మళయాళం నుండి వచ్చిన కీర్తి సురేష్ అక్కడ సినిమాలు చేస్తూ టాలీవుడ్, కోలీవుడ్ లతో కూడా సత్తా చాటుతుంది.