కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళీ ప్రేక్షకులకు బాగా పరిచయం వీరి తల్లి తండ్రులు కూడా స్టార్ హీరోలే. కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ తల్లి మేనక. చిరంజీవి పున్నమి నాగు సినిమా మనకు గుర్తు ఉంది గా ఆ చిత్రంలో కీర్తి తల్లి పూర్ణిమ అనే పాత్రలో నటించింది. ఇక కీర్తి విషయానికి వస్తే తెలుగులో రామ్ తో నేను శైలజ అనే చిత్రంతో పరిచయం అయింది. మొదటి చిత్రమే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది.
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు చేస్తూ రానిస్తుంది. ఈ నేపథ్యంలో కోలివుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఆమెకు మంచి రిలేషన్స్ ఏర్పడింది. చాలా సందర్భంలో వీరు బయట పార్టీలు పబ్ లు అంటూ తెగ తిరిగేశారు. ఆ టైంలో అనిరుద్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇక అంతే ఇద్దరి మద్య ప్రేమ నడుస్తుందని పుకార్లు షికారు చేశాయి. కీర్తి సన్నిహితులు ప్రేమ వ్యవహారం పై క్లారిటీ ఇచ్చిన ఈ విషయంకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు.
తాజాగా ఈ విషయంపై తన తల్లి మేనక రంగంలోకి దిగింది. నా కూతురు ప్రేమలో ఉందన్న మాట వాస్తవమే కానీ అది మీరు అనుకుంటున్న ప్రేమ కాదు. అంటూ.. తనకు ఇప్పుడు సినిమా పై ఉన్న ప్రేమ తప్ప వేరే ఎవరి మీద ప్రేమ లేదు. తాను తన కెరీర్ ను మాత్రమే ప్రేమిస్తుందని క్లారిటీ ఇచ్చారు. మరి ఇంతటితో ఈ గాసిప్ కు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి. కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో నితిన్ తో రంగ్ దే, మహేష్ తో సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తుంది.