మలయాళం ముద్దు గుమ్మ కీర్తి సురేష్ తెలుగు, తమిళ, హింది సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఏదైనా సినిమా ఒప్పుకుంటే ఎంతో డెడికేటెడ్ గా పనిచేస్తుంది. టాలీవుడ్ కు నేను శైలజ చిత్రంతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మసనులో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మధ్య సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు హల్చల్ చేస్తుంది. అవును ఆమె త్వరలో సంగీత దర్శకుడును పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ ను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం అప్పట్లో ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడేమో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యిందని వారు క్లోజ్ గా ఉన్న ఫోటోలతో సహా బయట పెట్టారు.
ఇక అందరు ఈ విషయం నిజమే అనుకుంటున్న తరుణంలో ఆమె సన్నిహితులు, ఈ విషయంపై ప్రస్తావిస్తూ అలాంటిది ఏమి లేదు కేవలం వారు మంచి స్నేహితులు మాత్రమే, క్లోజ్ గా ఫోటోలు దిగితే మాత్రం పెళ్లి చేసుకోబోతున్నట్ల అలాంటి వార్తల్లో నిజమేమి లేదని చెప్పేశారు. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది అన్నారు. అనిరుద్, కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై ఫుల్ స్టాప్ పడింది. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అని నెటిజన్స్ అంటున్నారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అన్నాత్తే అనే సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.