చిత్రసీమ లో సెంటిమెంట్ ను బాగా నమ్ముతారు..చిత్ర టైటిల్ దగ్గరి నుండి రిలీజ్ వరకు ప్రతిదీ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ వల్ల రంగ్ దే చిత్ర నిర్మాతలు కాస్త టెన్షన్ పడుతున్నారు. మహానటి చిత్రంతో ఎన్నో ప్రశంసలు , గుర్తింపు తెచ్చుకున్న కీర్తి..ఆ తర్వాత తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ విజయాలు అందుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ మధ్య వరుస సినిమాలు చేసినప్పటికీ అవన్నీ లాక్ డౌన్ కారణంగా ఓటిటి లలో రిలీజ్ అయ్యాయి. అయితే అవేవి కూడా విజయాలు సాధించలేదు.
ప్రస్తుతం ఈమె నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో నటిస్తుంది. భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..ప్రస్తుతం తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. కాని 50 % ఆక్యుపెన్సీ తో అంత వసూళ్ళు తిరిగి రాబట్టం సాధ్యమా అని ఆలోచిస్తున్నారట.
అందుకే మంచి ఆఫర్ ను ఓటిటి సంస్థలు ఇస్తే దానికి ఓకే చెప్పాలని చూస్తున్నారట. అయితే నితిన్ అభిమానులు మాత్రం ఈ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి ఫ్లాప్ గా మిగిలాయి. కాబట్టి అదే సెంటిమెంట్ రంగ్ దే కి కంటిన్యూ అవుతుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఫ్యాన్స్ మాత్రమే కాదు నిర్మాతలు సైతం ఇదే విషయం ఫై టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. మరి కీర్తి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.