టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న కుటుంబాల జాబితాలో రాజమౌళి కుటుంబం ఒకటి అనడంలో సందేహం లేదు. రాజమౌళి కుటుంబంతో పాటు ఆయన పెదన్న కీరవాణి కుటుంబం ఇంకా వారి ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పటికే సినిమా మేకింగ్ లో ఉన్నాడు. ప్రొడక్షన్ విషయంలో ఆయనకు చాలా ఆసక్తి ఉంది. ఇంకా సినిమాల ప్రమోషన్ కు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక కీరవాణి ఇద్దరు కొడుకుల్లో ఒకరు హీరోగా నటిస్తుండగా మరొకరు సంగీత దర్శకుడు అనే విషయం తెల్సిందే. సంగీత దర్శకుడిగా పరిచయం అయిన కాళ భైరవ సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాళ భైరవ గత కొంత కాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి మరెవ్వరో కాదు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న సింగర్. ఇటీవల ఆమె ఒక ప్రముఖ టీవీ షో లో కూడా కనిపించింది. ఇటీవల కాళ భైరవ ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరు అనే విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. తాజాగా ఒక సినిమా ప్రీమియర్ షో కు రాజమౌళి ఇంకా కీరవాణి దంపతులు హాజరు అయ్యారు.
ఆ షో కు కాళ భైరవతో పాటు ఆ సింగర్ కూడా హాజరు అయ్యింది. అంటే ఆమెతో కాళ భైరవ ప్రేమలో ఉన్న విషయం కుటుంబ పెద్దలకు తెలిసే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. త్వరలోనే కాళ భైరవ ఆ సింగర్ తో తన ప్రేమ విషయాన్ని స్వయంగా రివీల్ చేస్తాడేమో చూడాలి. ఈ విషయమై కుటుంబం నుండి ఎవరైనా స్పందిస్తే పుకార్లకు చెక్ పడుతుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి పెదన్న కీరవాణి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.