అబ్బా బా..బీ.. డైలగ్ తో ఫేమస్ అయిన కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై సీరియళ్లలో విలన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే తెలుగు బిగ్ బాస్ కు ఎంపికైంది. అప్పుడే తాను పడ్డ కష్టాలు అమె చేసే సేవ గురించి ప్రజలకు మరింతగా తెలిసింది. ఎవరైనా కష్టం వచ్చిందని వెళ్తే చాలు.. వారికి అండగా నిలబడి సాయం చేస్తుంది.
ఒక్క డైలాగుతోనే ఫేమస్ అయిన కళ్యాణి తన క్యారెక్టర్ మాత్రం అది కాదని చెప్తోంది. తాను ఎందో పద్ధతైన కుటుంబం నుంచి వచ్చానని.. బతికినన్నాళ్లు ఇలాగే ముక్కుసూటిగా ఉంటూ బతుకుతానని చెబుతోంది. అయితే ఇటీవలే కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆసక్తకర కామెంట్స్ చేసింది. తన గతాన్ని తల్చుకొని ఎమోషనల్ అయింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది.
అయితే భార్య అంటే వంటింటికే పరిమితం కాదని.. ఆమెకు కూడా స్వేచ్ఛ ఇవ్వలాని కరాటే కళ్యాణి తెలిపింది. కానీ అందరూ పెళ్లైన స్త్రీని వంటింటి కుందేలుగానే చూస్తారని… ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తోందని వివరించింది. అయితే తన తప్పు లేకపోయినా తాను ముక్కుసూటిగా మాట్లాడటంతో.. తన జీవితం ఇలా అయిపోయిందని వివరించింది. రెండు సార్లు విడాకులు తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నానని కరాటే కళ్యాణి వెల్లడించింది.
అయితే తనకు ప్రేమ, పెళ్లి కలిసి రావని అంది. కానీ సరైన అబ్బాయితో దొరికితే మాత్రం సహజ జీవనం చేయడానికి అయినా పెళ్లి చేసుకోవడానికి అయినా తాను సిద్ధమేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు తనకు సరైన అబ్బాయి దొరకలేదని చెప్పింది. గతంలో తాను పెళ్లి చేసుకున్న వాళ్లు తాగొచ్చి కొట్టడం.. అడిగితే గొడవ పడటం వంటివి చేసేవారని.. చాలా సమస్యలు ఎదుర్కున్నాని కరాటే కల్యాణి తెలిపింది. అయితే తనకు సీమంతం చేసుకోవాలనే ఓ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందంటూ ఎమోషనల్ అయింది. భవిష్యత్తులోనైనా తన కోరిక తీరుతుందో లేదో చూడాలి మరి.