బాలీవుడ్ సెన్షేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో సారి స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ తీసుకుంటారంటూ ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ ఇప్పుడు బాలీవు్ లో ఉన్న దాదాపు హీరోలు అంతా కూడా డ్రగ్స్ తీసుకుంటారంటూ బాంబు పేల్చింది. బాలీవుడ్ యంగ్ హీరోలు అయిన రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశిక్ ఇలా అంతా కూడా డ్రగ్స్ లో మునిగి తేలుతున్నట్లుగా ఆరోపించింది.
ఈ డ్రగ్స్ వ్యవహారానికి కరణ్ జోహార్ ప్రధాన నింధితుడు అంటూ ఆమె ఆరోపించింది. కంగనా వ్యాఖ్యల అనుసారం బాలీవుడ్ లో ప్రతి రోజు లక్షల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో స్టార్ డ్రగ్స్ కోసం ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హీరోలు దర్శకులు నిర్మాతలు ఇలా అంతా కూడా డ్రగ్స్ కు బానిస అయ్యారంటూ వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ ను ఏదో ఒక సందర్బంలో వాడే ఉంటారంటూ చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు ఒకరు నాతో బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇష్టం లేకున్నా చాలా మందిని డ్రగ్స్ కు అలవాటు చేసి జీవితాలతో ఆడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్స్ కు బానిసలు అవ్వడంతో పాటు ఇండస్ట్రీ పరువును కూడా సినీ ప్రముఖులు నాశనం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కంగనా వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల వారు ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఆమె చేస్తున్న ఆరోపణల గురించి ఎవరు కూడా కనీసం స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో కూడా కంగనా ఇలాంటి ఆరోపణలు చేసింది. కాని ఈసారి ఆమె చేస్తున్న ఆరోపణలు మరింత వేడిగా వాడిగా ఉన్నాయి. దాంతో ఈ విషయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.