బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ సినిమాల కంటే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటారు. లాక్ డౌన్ సమయంలో హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో కంగన బాగా ఫోకస్ అయ్యింది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖుల పేర్లు బయట పెట్టి సంచలనం సృస్థించింది. బాలీవుడ్ సినిమా అంత ఓ వైపు ఉండి కంగన ను టార్గెట్ చేసిన ఆమె ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ప్రతి సవాలును స్వీకరించి ఎదురించి నిలిచింది.
ఈ మధ్య ఆమె నటించిన ఝాన్సీ రాణి జీవిత చరిత్రను మణికర్ణిక లో నటించింది. ఈ చిత్రానికి కంగన నే దర్శకత్వం వహించింది. బాలీవుడ్ లో అశ్విని ఐయ్యర్ తివారి దర్శకత్వంలో పంగ అనే చిత్రంలో నటిస్తుంది. కబడ్డి ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కోలివుడ్ లో దివంగత నేత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో తలైవి అనే చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ఆమె మరో రాజకీయనాయకురాలి జీవిత చరిత్రలో నటించడానికి సిద్దం అవ్వుతుంది.
ఈ విషయంపై కంగన మాట్లాడుతూ … ఓ పుస్తకం ఆధారంగా ఇందిరాగాందీ జీవిత చరిత్రను రూపొందించనున్నారు. అప్పటి ఎమర్జెన్సీ పరిస్త్తులు ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి అంశాలతో పాటుగా ఆనాటి రాజకీయనాయకుల పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి అన్నారు. సంజయ్ గాందీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖులు కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. మరి ఇందిరా గాందీ పాత్రలో కనిపిస్తాను అని మాత్రం కంగన కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్రా బృందం అఫిషియల్ ప్రకటన ఇవ్వనున్నది.