బాలీవుడ్ క్వీన్ కంగనా నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య రాజకీయాల్లోనూ వేలుపెట్టి ఏకంగా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. తాజాగా ఈమె ఫై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫోటోనే.
బుధవారం ఉదయం ఆమె తన ట్విట్టర్లో, ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తన జీవితంలో.. తాను ఎంతో కుతూహలంతో వెళ్లిన అద్భుతమైన, అందమైన ప్రదేశాల్లో మెక్సికో ఒకటని పోస్ట్ చేసిన కంగనా.. మెక్సికోలోని తులుం అనే చిన్న ఐలాండ్లో దిగిన ఫొటో ఇదేనంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. కంగనా బికినీ ధరించి బీచ్లో కూర్చుని ఉండగా.. సముద్రంలోని అలలను చూస్తున్న సందర్భంలో ఫొటో తీసినట్టుగా ఉంది. కంగనా ఈ ఫొటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
ఈ విమర్శలపై స్పందిస్తూ.. కంగనా మరో పోస్ట్ పెట్టింది. తన బికినీ ఫొటోను చూసి కొందరు వ్యక్తులు తనకు సనాతన ధర్మం గురించి హితబోధ చేస్తున్నారని వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అంతేకాదు, భైరవి దేవత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా, రక్తం తాగుతూ మీ ముందు నిలబడితే మీరేం చేస్తారని కంగనా ప్రశ్నించింది. మీరు భయపడతారని, ఆ సందర్భంలో మిమ్మల్ని మీరు భక్తులుగా చెప్పుకోరా అని ఆమె నిలదీసింది.