లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా వస్తోందంటే లు అభిమానులు వెర్రెక్కిపోతారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని తెగ వెయిట్ చేస్తుంటారు. అయితే తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం విక్రమ్. అయితే గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది ఆన 232వ సినిమా కావడం గమనార్హం.
లోకేష్ కనక రాజ్ రూపొందిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో భాగంగానే కేట్ కట్ చేసి ఒకరికొకరు తినిపించున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని వారు చెబుతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తామన్నారు. ఇదో యాక్షన్ డ్రామా సినిమా అని తెలిపారు. అయితే ఇటీవలే బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్న కమల్ దృష్టంతా ఇక సినిమాలపైనే అని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.