చందమామ కాజల్ మొత్తానికి ఓ ఇంటిది అయినా సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో అతి కొద్దీ మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న ఈమె .. ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉంది. దీనికి సంబందించిన పిక్స్ ను సైతం షేర్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంది.
హనీమూన్ కోసం మాల్దీవులకు ఈ కొత్త జంట వెళ్ళింది. అక్కడి సముద్రపు అందాలను వీరు బాగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా కాజల్ షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భర్తతో రొమాంటిక్ ఫోజులో కాజల్ దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంది.