కాజల్.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర తారల ఏలిన హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటీమణి. అగ్ర కథానాయకులతో పాటు యువ కథానాయకులతో సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకుంది కాజల్. 2020 అక్టోబర్ లో వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. గౌతమ్ కిచ్లు తో హ్యాపీ లైఫ్‌ని సాగిస్తోంది. తర్వాత కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. తర్వాత మళ్లీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అడపా దడపా చిత్రాల్లో నటిస్తోంది.
ఇది ఇలా ఉండగా ఆమెకు కూడా నెటిజన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు తన తాజా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఆడవారి పట్ల బాడీ షేమింగ్ చేస్తూ చేసిన కామెంట్స్ పై కాజల్ గట్టిగా రిప్లై ఇచ్చింది కాజల్. తన జీవితంలో ఇప్పటి వరకు చాలా మార్పులు చేర్పులు చూశానని… అలాగే వాటితో పాటుగా కొన్ని నెగెటివ్ కామెంట్లు, మెసేజ్ లు మీమ్స్ వంటివి కూడా చూశానని వెల్లడించింది.
గర్భం దాల్చిన సమయంలో ఏ మహిళలో అయినా శారీరక మార్పులు సహజమని చెప్పింది. గర్భం లోపల శిశువు పెరుగుతున్న క్రమంలో ఆమె తనలో కూడా పెరుగుదలను గమనిస్తుందని ఇవన్నీ ప్రకృతి సహజమని కాజల్ వెల్లడించింది. అందుకే ప్రతి మహిళా.. ఎప్పుడూ ఒకేలా ఉండిపోవాలని ఏ స్త్రీ కూడా అనుకోదని.. ప్రతి మహిళ లైఫ్ లో వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేయాలని చెప్పింది కాజల్.
ప్రెగ్నెన్సీ అనేది ఎప్పటికీ ఉండదని.. ఎల్లప్పుడూ ఫిజికల్‌గా ఫిట్ గా ఉండడం, యోగా లేదా ఇతర ఎక్సర్ సైజ్లు చేస్తే మళ్లీ ఎవరైనా నార్మల్ అవుతారని సూచించింది చందమామ. కాజల్ ఇచ్చిన ఈ రిప్లై తో ఆడవారిపై చేసే నెగెటివ్ కామెంట్స్ కు అన్నింటికీ గట్టి బదులు ఇచ్చినట్లు అయింది.