సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ తన ఫ్యాన్స్ ను మోసం చేసిందని లేటెస్ట్ టాక్. అదేంటి కాజల్ ఆమె ఫ్యాన్స్ ను ఎందుకు మోసం చేస్తుందని అంటే.. సీక్రెట్ గా పెళ్ళి ఫిక్స్ చేసుకోవడమే కాకుండా ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకుందట అమ్మడు. షాకింగ్ గా ఉంది కదా.. ప్రముఖ ఇంటీరియర్ డిజనర్, బిజినెస్ మెన్ గౌతం కిచ్లుతో కాజల్ పెళ్ళికి ఫిక్స్ అయ్యిందని వార్తలు జోరందుకున్నాయి. ఫిక్స్ అవడమే కాదు రింగులు గట్రా మార్చేసుకున్నారని కూడా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
మరి అమ్మడు ఈ విషయాన్ని ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచాలనుకుందో అర్ధంకాక ఫ్యాన్స్ బుర్ర హీటెక్కిపోతుంది. కాజల్ పెళ్ళిపై ముంబై మీడియా చేస్తున్న ఈ హడావిడిలో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాలి. కాజల్ ప్రసుత్తం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటుగా తమిళంలో ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది.
పుష్కరకాలం నుండి తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న కాజల్ మధ్యలో కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డట్టు అనిపించినా తిరిగి మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం సీనియర్ స్టార్స్ కు కాజల్ ది ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది. అయితే కాజల్ ఈ వార్తలపై స్పందించకుండా ఇన్ స్టాగ్రాం పేజ్ లో లవ్ సింబల్ తో ఓ పోస్ట్ పెట్టింది. దాని వల్ల దాదాపు ఈ వార్తలన్ని నిజమే అని ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్. ఎంతైనా చందామామ లాంటి కాజల్ ను పెళ్లాడబోయే అతను లక్కీ అని చెప్పొచ్చు.