తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలకు అలవాటు పడి పోయారు.. వారు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఖచ్చితంగా తిరష్కరిస్తారని తెలుగు ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయంగా మారిపోయింది. కాని ఇతర భాషల్లో మాత్రం కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నో వస్తున్నాయి. అద్బుతమైన కాన్సెప్ట్ సినిమాలతో రూపొంది సక్సెస్ అయిన ఇతర భాష సినిమాలను అభిరుచి గల ప్రేక్షకుల కోసం ఆహా వారు తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా తాజాగా తీసుకు వచ్చిన సినిమానే తమిళ జీవి. తెలుగు లో కూడా అదే టైటిల్ తో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ (వెట్రీ) కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. ఎన్నో జాబ్ లు చేసి విసుగెత్తి చివరకు ఒక జ్యూస్ షాప్ లో వర్కర్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చేస్తున్న పని లేక ఏదో ఒకటి చేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆశ అతడిది. జాబ్ పై విరక్తి కలిగి ఇంటికి వెళ్లి పోవాలనుకున్న సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ బంగారంను దొంగిలిస్తాడు. బంగారం దొంగిలించిన తర్వాత అతడి కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. తన ఓనర్ కుటుంబంలో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినట్లుగానే తన కుటుంబంలో విషాదాలు చోటు చేసుకోవడం ఇంకా కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ పరిస్థితులను శ్రీనివాస్ లోతుగా అధ్యయనం చేసి షాకింగ్ విషయాలను తెలుసుకుంటాడు. తాను జమిందార్ వారసుడిని అనే విషయాన్ని కూడా అతడు తెలుసుకుంటాడు. ఇంతకు ఆ పరిస్థితులు ఏంటీ.. చివరకు శ్రీనివాస్ కు దక్కింది ఏంటీ అనే విషయాలను చూడాలంటే సినిమా ను ఆహాలో స్ట్రీమింగ్ చేయాల్సిందే.
విశ్లేషణ :
నటీ నటులు వారి పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెట్రీ, రోహిణి మరియు కరుణాకరన్ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథనంపై ఇంట్రెస్ట్ కలిగించేలా చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. దర్శకుడు కథను చాలా సింపుల్ గా చెప్పుతూనే ఇంట్రెస్టింగ్ కథనంతో ముందుకు తీసుకు వెళ్లాడు. కథలో ట్విస్ట్ తో ప్రేక్షకులు అవాక్కవుతారు. ఇటీవలే వచ్చిన ప్లే బ్యాక్ సినిమా తరహాలోనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. కథలో సింపుల్ ట్విస్ట్ లు మరియు టర్న్ లు ఉండటంతో పాటు భలే ఉందే అనిపించేలా నరేషన్ సాగింది. విభిన్నమైన పాయింట్స్ ను చక్కగా చూపించారు.
ప్లస్ పాయింట్స్ :
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్,
ట్విస్ట్ లు మరియు సస్పెన్స్
మైనస్ పాయింట్స్ :
కాస్త తమిళ ప్లేవర్,
కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం.
చివరగా : ఆహా ‘జీవి’ మంచి టైమ్ పాస్ మూవీ.
రేటింగ్ : 3.25/5.0