
తల్లిదండ్రులు ఏ ఏ రంగాల్లో ఉంటారో వారి పిల్లలు కూడా అదే రంగంలోకి వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ తాజాగా ఓ స్టార్ హీరో కూతురు మాత్రం తన తండ్రిలాగా యాక్టర్ అవ్వాలనుకోవట్లేదని తెలిపింది.

బాలీవుడ్ నెపోటిజంపై చాలా నెగిటివిటీ ఉంది. అయినా కూడా స్టార్ నటీనటుల వారలు ఒక్కొక్కరిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతూనే ఉన్నారు. అదే బాటలో అమీర్ ఖాన్ కూడా తన కుమారుడిని మహారాజా అనే చిత్రంతో హీరోగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. కానీ అమీర్ కూతురు మాత్రం యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదంటోంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కచ్చితంగా సినిమాల్లోకి వస్తుందని చాలా మంది అనుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ ఐరా ఖాన్ కు నటిగా మారే ఆలోచనా ఉందా అని అడిగారు. అందుకు సమాధానంగా ఐరా ఖాన్ నేను సినిమాల్లోకి రావడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఆమె యాక్టర్ కాకుండా డైరెక్టర్ అవ్వాలనుకుంటుందేమో అని బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.